మా పాలనకు ప్రజలు పట్టం కట్టారు: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పాలనకు ప్రజలు పట్టం కట్టారని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అన్నారు. ఎన్నికల ప్రక్రియపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగిన ఎన్నికల్లో వర్గాల్లు, ప్రాంతాలనే తేడా లేకుండా అంతటా కూటమి పార్టీలకు ప్రజలు నీరాజనం పట్టారని చెప్పారు. రెండేళ్ల ఐదు నెలల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో అఖండ విజయం సాధించినట్లు సీఎం వెల్లడించారు.

తమను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఎల్ నినో, అర్నాబ్, మురసు విపత్తులను ఎదుర్కొని తమకు ప్రజలు పట్టం కట్టారన్న సీఎం.. ఈ విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చారు. 2024 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ప్రజల ఆదరణ మరింతగా లభించిందన్నారు. పట్టణాలు, పరిషత్ ఎన్నికల్లో కూటమి మొత్తంగా 58.9 శాతం ఓట్లు సాధించిందని తెలిపారు.

ప్రజలు కూటమికి అండగా ఉంటామని తీర్పు చెప్పారని.. మేం చెప్పేవి చేసే రోజులొస్తాయని ఈ తీర్పుద్వారా వెల్లడైందన్నారు. గత ఐదేళ్లపాటు జరిగిన విధ్వంసాన్ని చెప్పడమే కాదు, శ్వేత పత్రాల ద్వారా వివరించానని చంద్రబాబు (CM Chandrababu) చెప్పారు. రెండున్నరేళ్ల పాలన తర్వాత ప్రజా స్పందనకు స్థానిక ఎన్నికలు ఉదాహరణగా నిలిచాయని సీఎం స్పష్టం చేశారు.

Also Read : ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>