ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అలర్ట్. టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం ఫీజు (AP SSC Exam Fee) చెల్లింపుల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రకారం.. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 11 నుంచి 25వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. గడువు ముగిసిన తర్వాత ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు డిసెంబర్ 15 వరకు అవకాశం కల్పించారు. రూ. 50 ఫైన్‌తో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు, రూ. 200 ఫైన్‌తో డిసెంబర్ 3 నుంచి 9 వరకు, చివరిగా రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు.

పరీక్ష ఫీజు (AP SSC Exam Fee) వివరాల విషయానికి వస్తే, రెగ్యులర్ అభ్యర్థులు రూ. 125, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 3 సబ్జెక్టుల కంటే ఎక్కువ ఉంటే రూ. 125, 3 సబ్జెక్టుల వరకు అయితే రూ. 110 చెల్లించాల్సి ఉంటుంది. వొకేషనల్ అభ్యర్థులు సాధారణ ఫీజుకు అదనంగా మరో రూ. 60 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. వయోపరిమితి సడలింపు కోరే అభ్యర్థులు అదనంగా రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది.

ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in లోని స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే ఈ ఫీజు చెల్లింపులు పూర్తి చేయాలని, సీఎఫ్‌ఎంఎస్ లేదా బ్యాంక్ చలానాల ద్వారా వచ్చే చెల్లింపులను పరిగణనలోకి తీసుకోబోమని పరీక్షల విభాగం స్పష్టం చేసింది. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు.

Also Read : నెల్లూరులో విషాదం.. గుండెపోటుతో యువ డాక్టర్ మృతి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>