క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. తగ్గిన 137 ఔషధాల ధరలు

కలం, వెబ్ డెస్క్: క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.
క్యాన్సర్ ఔషధాల ధరలను (Cancer Medicines Price) తగ్గిస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (NPPA) మందుల ట్రేడ్ మార్జిన్లపై 30 శాతం పరిమితి విధించింది. ఈ నిర్ణయంతో మొత్తం 137 రకాల క్యాన్సర్ ఔషధాల గరిష్ఠ ధరల తగ్గింపు నేటి (సోమవారం) నుంచే అమల్లోకి వచ్చాయి.

కేంద్రం ధరల తగ్గింపు నిర్ణయంతో కొన్ని క్యాన్సర్ ఔషధాల ధరలు ఏకంగా 96.45 శాతం వరకు తగ్గాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ‘పాల్‌బోప్రో’ ఔషధం ధర గతంలో రూ.40,421 ఉండగా, ఇప్పుడు రూ.2,720కు లభిస్తుంది. అలాగే ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ‘అబిరోన్’ ధర రూ.41,250 నుంచి రూ.3,218కు తగ్గింది.

ఆస్పత్రులు, మెడికల్ షాపులకు కేంద్రం ఆదేశాలు

ఔషధాల కొత్త ధరల వివరాలను ఆస్పత్రులు, రిటైలర్లు, మెడికల్ షాపుల్లో తప్పనిసరిగా తమ నోటీసు బోర్డులు, వెబ్‌సైట్లలో ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రోగులకు తగ్గించిన ధరలకే మందులు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మందుల రేట్లు తగ్గడంతో రోగులకు చికిత్స భారం తగ్గే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>