కలం, నిర్మల్: హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో కొలువైన శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని మాజీ దేవాదాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy) సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఇంద్రకరణ్ రెడ్డికి అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారి మూలవిరాట్టును దర్శించుకుని, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి తీర్థప్రసాదాలను బహూకరించారు. దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆ జగన్మాతను ప్రార్థించినట్లు తెలిపారు.

