హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. కూకట్ పల్లిలో ఎగిసిపడిన మంటలు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ కూకట్‌పల్లి ఆస్బెస్టాస్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం (Kukatpally Fire Accident) జగిరింది. పేపర్ టీ కప్పులు, ప్లేట్ల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్రమంగా పక్కనే ఉన్న నెయ్యి, కుర్కురే, హల్దీరామ్ ఉత్పత్తుల స్టాక్ గోదాములకు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం (Kukatpally Fire Accident) జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

నగరంలోని పలు ప్రాంతాల్లోనూ అగ్ని ప్రమాదాలు

హైదరాబాద్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ అగ్నిప్రమాదాలు జరిగాయి. బేగంబజార్‌లోని ఓ భవనంపై బాణసంచా నిప్పురవ్వలు పడటంతో మంటలు చెలరేగాయి. స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే జీడిమెట్లలోని ఓ స్క్రాప్ దుకాణంలో బాణసంచా కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు దుకాణం పూర్తిగా దగ్ధమైంది. మైలార్‌దేవ్‌పల్లిలోని ఓల్డ్ విలేజ్ ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్ గోదాములోనూ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు సికింద్రాబాద్ బండిమెట్‌లోని ఓ డిస్ట్రిబ్యూటర్ డ్రగ్‌మార్ట్‌లో కూడా మంటలు చెలరేగాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>