నిర్మల్‌లో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలను (Diwali Celebrations) ఆదివారం ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకుని ఇళ్లను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి, ఇంటి ముందు దీపాలు వెలిగించారు. భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యాపార సంస్థలు, దుకాణాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన వ్యాపారులు లక్ష్మీ పూజలు నిర్వహించి, ఏడాది పొడవునా వ్యాపారాలు సజావుగా సాగాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం చిన్నారులు, యువకులు, మహిళలు, పెద్దలు పెద్దఎత్తున బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. టపాసుల మోతలు, తారాజువ్వల వెలుగులతో పట్టణాలు, గ్రామాలు దీపావళి శోభను సంతరించుకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>