కలం, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట దీపావళి’ వేడుకల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally Satyanarayana) పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైన మార్కాపురం లావణ్య–రమేష్ దంపతుల నివాసంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంతో కలిసి కవ్వంపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే టపాసులు పేల్చి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు పొందిన కుటుంబంతో కలిసి పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని, ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ శోభారాణి, తిమ్మాపూర్, మానకొండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బండారు రమేష్, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు శ్రీగిరి రంగారావు, కుంట రాజేందర్ రెడ్డి, గోపు మల్లారెడ్డి, మామిడి అనిల్ కుమార్, బుదారపు శ్రీనివాస్, కొత్త తిరుపతి రెడ్డి, నోముల అనిల్, రాముల యాదవ్, ఎలక రాజు తదితరులు పాల్గొన్నారు.

