నిర్మల్‌ మార్కెట్‌లో దీపావళి సందడి.. కిటకిటలాడిన దుకాణాలు

కలం, నిర్మల్: దీపావళి పండుగను పురస్కరించుకుని నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఆదివారం మార్కెట్‌ సందడిగా మారింది. పండుగ వేడుకలకు అవసరమైన వస్తువుల కొనుగోళ్ల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు తరలివచ్చారు. దీంతో పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడళ్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. దీపావళి సందర్భంగా ప్రతి ఇంట్లో ప్రమిదలు వెలిగించి లక్ష్మీపూజ నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో మహిళలు మట్టి ప్రమిదలు, లక్ష్మీదేవి విగ్రహాలు, చిత్రపటాలను ఆసక్తిగా కొనుగోలు చేశారు. బట్టల దుకాణాలు, బాణాసంచా విక్రయ కేంద్రాల్లోనూ రద్దీ నెలకొంది. పండుగకు అవసరమైన పిండి వంటల సరుకులు, సేమియా, పండ్లు, పూల కొనుగోళ్లు జోరుగా సాగాయి. వ్యాపారులు సైతం దుకాణాల అలంకరణ కోసం బంతిపూలు, అరటి ఆకులను కొనుగోలు చేశారు. పండుగ కొనుగోళ్లతో మార్కెట్‌ ప్రాంతమంతా సందడిగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>