నోట్ల రద్దుకు పదేళ్లు.. బీజేపీపై మంత్రి పొన్నం విమర్శలు

కలం, వెబ్ డెస్క్: నోట్ల రద్దుకు పదేళ్లు పూర్తయిన వేళ కేంద్రప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్ర విమర్శలు చేశారు. నల్లధనాన్ని వెలికితీస్తాం అని గొప్పగా ప్రకటిస్తూ కేంద్రం ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకొని పదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు జరిగిన చర్యలు శూన్యం అని ఆరోపించారు. నోట్ల రద్దు చేసి పదేళ్లు గడిచినా నల్లధనం వెలికితీతలో సాధించిన ఫలితాలేమిటి అని మంత్రి ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల దేశంలో అవినీతి తగ్గిందా? సామాన్యుల జీవితాల్లో మార్పు వచ్చిందా? అని నిలదీశారు.

నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు, రైతులు, కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని పొన్నం గుర్తు చేశారు. తమ సొంత డబ్బు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు రోజుల తరబడి క్యూలలో నిలబడాల్సి వచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నాయని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

పెద్ద పెద్ద హామీలతో తీసుకున్న ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై, ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిందని మంత్రి (Ponnam Prabhakar) ఆరోపించారు. డీమానిటైజేషన్ చేసి పదేళ్లు గడుస్తున్నా కూడా బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో మిగిలి ఉన్నాయన్నారు. ఈ నిర్ణయం వల్ల పాలకుల ప్రజలకు కేవలం కష్టం మిగిలింది తప్ప.. సాధించింది శూన్యం అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>