ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి గంగుల పరామర్శ

కలం, కరీంనగర్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్న కిసాన్ నగర్‌కు చెందిన కల్లేపల్లి శివను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) ఆదివారం పరామర్శించారు. శివ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోకుండా వాటిపై పోరాడాలని బాధితుడికి సూచించారు.

కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, పార్టీ తరఫున అండగా ఉంటామని గంగుల భరోసా ఇచ్చారు. చికిత్సకు సంబంధించిన బిల్లు మొత్తాన్ని తానే చెల్లిస్తానని గంగుల హామీనిచ్చారు. శివ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను పూర్తిస్థాయిలో విచారించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను గంగుల డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>