ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నిండాలి: ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్ : దీపావళి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti) ఆకాంక్షించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆదివారం నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి, చీకటిపై వెలుగు ప్రసరించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారని పేర్కొన్నారు.

ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకోవాలని కోరారు. టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ దీపావళి ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>