కలం, నేరడిగొండ : నేరడిగోండ మండలం గుత్పల (Guthpala Village) గ్రామ సర్పంచ్ పెండూర్ లక్ష్మీబాయి భీంరావు, మాజీ సర్పంచ్ గసకంటి రవి, వార్డు సభ్యులు సీహెచ్ రవి, జి. రవితో పాటు సుమారు 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలతో విభేదిస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో పనిచేసేందుకు బీఆర్ఎస్‌లో చేరినట్లు వారు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని అన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

