ఆదివాసీ సంస్కృతికి దండారి ఉత్సవాలు ప్రతీక: అనిల్ జాదవ్

కలం, గుడిహత్నూర్: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు దండారి (గుస్సాడి) ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (Anil Jadhav) అన్నారు. ఆదివారం గుడిహత్నూర్ మండలం మచ్చపూర్ కొలంగూడ గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్థులు, ఆదివాసీ పెద్దలు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే (Anil Jadhav) మాట్లాడుతూ.. దండారి పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, తరతరాలుగా ఆదివాసీలు పాటిస్తున్న జీవన విధానం, ఐక్యత, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. ఆధునిక కాలంలోనూ పూర్వీకుల ఆచార వ్యవహారాలను, కళలను కాపాడుతూ భావితరాలకు అందిస్తున్న ఆదివాసీ సమాజాన్ని అభినందించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు మన ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపునిస్తాయని, వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>