కలం, వెబ్ డెస్క్: జపాన్లోని (Japan Earthquake) సెంట్రల్ రీజియన్ లో ఆదివారం వేకువజామున భారీ భూకంపం సంభవించింది. పటిష్టమైన భూ ప్రకంపనల ధాటికి పలు భవనాల్లోని అద్దాలు పగిలపోయాయి. ప్రమాదాన్ని గ్రహించిన ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ ఘటనలో శిథిలాలు, గాజు పెంకులు తగిలి కనీసం 22 మంది తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.7గా నమోదైందని అధికారులు వెల్లడించారు.
భూకంపం కారణంగా పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. బుల్లెట్ రైలు సేవలు తాత్కాలికంగా నిలిచిపోగా, స్థానిక రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. అలాగే పలు భవనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. ఈ తీవ్రత వల్ల తీరప్రాంతాలకు ఎలాంటి సునామీ ప్రమాదం లేదని జపాన్ పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే రాబోయే కొద్ది రోజులు తదుపరి ప్రకంపనలువచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

