పేదల సొంతింటి కల సాకారం దిశగా అడుగులు: శివసేనారెడ్డి

కలం, వనపర్తి: సొంతింటి కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి (Shiva Sena Reddy) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం పెద్దగూడెం గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ప్లాట్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలి విడతగా 35 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం, గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని, నిరుపేదలకు ఇంటి స్థలాలు అందించడం ద్వారా వారి సొంతింటి కల సాకారమయ్యేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ పెద్దగూడెంలో మొత్తం 145 మంది లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించాల్సి ఉండగా, తొలి విడతలో 35 మందికి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. మిగిలిన అర్హులకు త్వరలో గ్రామపంచాయతీ కార్యాలయంలో లక్కీడిప్‌ నిర్వహించి పారదర్శకంగా పట్టాలు కేటాయిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, సర్పంచ్ పుష్పలత శివకుమార్, ఉపసర్పంచ్ పోలికమ్మ, మాజీ సర్పంచ్ జానకి కొండన్న, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>