పినపాకలో పుష్కరాలు.. రూ.21.42 కోట్లు విడుదల!

​కలం, ఖమ్మం బ్యూరో: ​2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను (Godavari Pushkaralu) అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ముందస్తు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలో భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.21.42 కోట్లను విడుదల చేసిందని పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు.

​గోదావరి పుష్కరాలు పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో, రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు గోదావరి నదికి తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఎమ్మెల్యే ముందస్తు ప్రణాళికతో ఘాట్లు, రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ​ఈ నిధులతో నియోజకవర్గంలోని పుష్కర ఘాట్ల ఆధునీకరణ, స్నాన ఘట్టాల అభివృద్ధి, అవసరమైన మరమ్మతులు, రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు-భవనాల శాఖల సమన్వయంతో ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయి. పుష్కరాల ప్రారంభానికి ముందే పనులన్నీ నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పినపాక పరిధిలో పుష్కరాల కోసం భారీగా నిధులు రావడం పట్ల స్థానిక ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>