ప్రధాని మోదీకి ఆయనే ముఖ్యం: అభిజిత్ దీప్కే

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌(Gyanesh Kumar)ను దేశమంతా వ్యతిరేకిస్తున్నా, ప్రధాని మోదీకి మాత్రం ఆయనే ముఖ్యమని కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే (Abhijeet Dipke) విమర్శించారు. కేరళలోని కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “ఇండియాను అస్థిరపరచడానికి విదేశీ శక్తులు సీజేపీని ఉపయోగించుకుంటున్నాయని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీని సూటిగా అడగాలనుకుంటున్నా. ట్రంప్‌నకు ఎవరు సరెండర్ అయ్యారు..? రష్యా నుంచి ఆయిల్ కొనవద్దని ట్రంప్ చెప్పగానే ఆపిందెవరు..? 18 శాతం టారిఫ్ బెదిరింపులకు భయపడిందెవరు..? మీరు ఈ దేశాన్ని అమెరికా అధ్యక్షుడికి అమ్మేశారు. మేం కాదు” అని విమర్శలు గుప్పించారు.

మా ఉద్దేశం అది కాదు..

ప్రభుత్వాలను మార్చడం అనేది ఎన్నికల ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుందని అభిజిత్ దీప్కే (Abhijeet Dipke) స్పష్టం చేశారు. “ప్రధాని మోదీ ఈ దేశ యువతపైనే యుద్ధం ప్రకటించారు. పిల్లలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే.. వారి వెనుక పాకిస్థాన్, అమెరికా ఉందని, విదేశీ నిధులు అందుతున్నాయని అవమానిస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్లు.. మహాత్మా గాంధీ ఈ దేశ ఆత్మ, డాక్టర్ అంబేడ్కర్ ఈ దేశ వెన్నుముక, పండిట్ నెహ్రూ ఈ దేశ మేధస్సు. ప్రధాని మోదీ (PM Modi) మరో 120 ఏళ్లు అధికారంలో ఉన్నా వారిని మించిన నాయకుడు ఎప్పటికీ కాలేరు. అందుకు ఆయన సంస్థ కూడా ఒక కారణం. దేశ స్వాతంత్య్రం కోసం మహానుభావులు పోరాటాలు చేస్తుంటే.. ఆయన సంస్థ వలస పాలకుల బూట్లు శుభ్రం చేస్తోంది” అని ధ్వజమెత్తారు.

Also Read : రేవంత్ రేసుగుర్రం అనుకుంటే.. కీలుగుర్రం అయ్యిండు : కవిత

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>