‘అలియాస్ రుక్మిణి’ నుంచి నితిన్ లుక్ రిలీజ్!

క‌లం, సినిమా: బ్లాక్‌బస్టర్ సక్సెస్ ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. ‘అలియాస్ రుక్మిణి’ (Alias Rukmini) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ (Nithiin) హీరోగా నటిస్తుండగా ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మాణంలో రొమాన్స్, హ్యూమర్, ఆసక్తికరమైన కథనంతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన కొత్త ప్రమోషనల్ వీడియోలో నితిన్‌ను కృష్ణగా సరికొత్త అవతార్‌లో పరిచయం చేశారు. రుక్మిణి తన ప్రపంచంలోకి రాకముందు కృష్ణ జీవితం ఎలా ఉండేది? అనే ఆసక్తికరమైన అంశాన్ని ఈ వీడియో ద్వారా చూపించారు.

యంగ్ కృష్ణను, అతడి కలలను, ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని పరిచయం చేశారు. దర్శకుడు మురళీ కాంత్ దేవసోత్, రుక్మిణి పాత్రలో నటిస్తున్న ఆఫియా సయ్యద్‌తో యువకుడైన కృష్ణ గురించి మాట్లాడుతున్న సన్నివేశంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. ఆ సంభాషణలోకి నితిన్ యంగ్ అండ్ చార్మింగ్ లుక్‌లో ఎంట్రీ ఆకట్టుకుంది. ఈ లుక్‌లో నితిన్ దాదాపు పదేళ్లు చిన్నవాడిగా కనిపిస్తున్నారు. పాత్ర వయసుకు తగ్గ అమాయకత్వం, స్వేచ్ఛగా ఉండే స్వభావాన్ని ఆయన లుక్ చక్కగా కనిపిస్తోంది. కృష్ణ పాత్రలో నితిన్ చేసిన ఈ సరికొత్త మేకోవర్ ఆయన నటనకు మరో కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. నితిన్, ఆఫియా సయ్యద్ జోడీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవనుంది. వీరిద్దరి పాత్రలు కథకు ప్రత్యేకమైన రొమాంటిక్ ఫ్లేవర్‌ను అందించనున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఫస్ట్ సింగిల్ ‘రుక్కు రుక్కు రుక్మిణి’తో ప్రారంభించారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్‌లో రుక్మిణిపై కృష్ణకు ఉన్న ప్రేమను అందంగా ఆవిష్కరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>