IAF రికార్డ్.. 13 వేల అడుగుల ఎత్తులో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్

కలం, వెబ్ డెస్క్: భారత వైమానిక దళం మరో అద్భుత ఘనత సాధించింది. లడఖ్‌లోని న్యోమా ఎయిర్‌బేస్‌లో అత్యంత ఎత్తులో భారీ రవాణా విమానాన్ని ల్యాండ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. రష్యా తయారు చేసిన అత్యంత శక్తివంతమైన IL-76MD రవాణా విమానాన్ని సముద్ర మట్టానికి సుమారు 13,000 అడుగుల ఎత్తులో ల్యాండ్ చేసిన ఐఏఎఫ్ (Indian Air Force) చరిత్ర సృష్టించింది.

చైనా సరిహద్దుకు సమీపంలో కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ల్యాండ్ అయింది. ఇంతటి ఎత్తులో IL-76MD విమానం ల్యాండింగ్ కావడం ప్రపంచంలోనే తొలిసారి అని భారత వైమానిక దళం (Indian Air Force) తెలిపింది. సాధారణంగా అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ సవాళ్లతో కూడుకుని ఉంటుంది. తక్కువ గాలి సాంద్రత, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పర్వత ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు విమానాల రాకపోకలకు సవాలుగా మారుతాయి.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారీ రవాణా విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసిన ఐఏఎఫ్ భారత వైమానిక దళం సామర్థ్యాన్ని మరోసారి చాటిచెప్పింది. ఈ ఘనతతో లడఖ్ ప్రాంతంలో భారత సైనిక దళాలకు అవసరమైన సామగ్రి, ఇతర కీలక వనరులను వేగంగా చేరవేసే వ్యూహాత్మక ఎయిర్‌లిఫ్ట్ సామర్థ్యం మరింత బలోపేతంగా మారనుంది. చైనా సరిహద్దుకు సమీపంలో ఐఏఎఫ్ సాధించిన ఈ విజయం దేశ రక్షణ రంగంలో కీలక మైలురాయిగా నిలిచింది.

Also Read : ఎమర్జెన్సీపై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>