జగిత్యాల దత్తత బాలుడి తల్లిదండ్రులకు బీజేపీ నేత పరామర్శ

కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) జిల్లా మూడేళ్ల దత్తత బాలుడి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో దత్తత బాలుడి తల్లిదండ్రులను బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి పరామర్శించారు. బాలుడి దత్తత వ్యవహారంపై మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో రవీందర్ రెడ్డి బాలుడి తల్లిదండ్రుల నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.

బాలుడి దత్తత ప్రక్రియ అధికారికంగా పూర్తయినట్లు వచ్చిన కథనాలపై ఆరా తీశారు. బాలుడికి సంబంధించిన వ్యవహారంలో తల్లిదండ్రులకు న్యాయం జరగాలని, చిన్నారి భవిష్యత్తు సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. బాలల సంక్షేమం, తల్లిదండ్రుల హక్కులు, చిన్నారుల భవిష్యత్తు విషయంలో సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. వారి వెంట ఠాకూర్ కిషోర్ సింగ్, బిట్టు , చిట్నేని అన్వేష్ రావు, కూర్మచలం సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>