అపార్ట్‌మెంట్‌లోకి దూసుకెళ్లిన దీపావళి రాకెట్.. బిల్డింగ్ ధ్వంసం!

కలం, వెబ్ డెస్క్ : దీపావళి పండుగకు ముందే పటాకులు కాల్చడం ఒక అపార్ట్‌మెంట్‌లో తీవ్ర భయాందోళనలకు దారి తీసింది. ముంబైలోని ఘాట్‌కోపర్ (Ghatkopar Fire) తూర్పు పంత్‌నగర్, వల్లభ్ బాగ్ లేన్‌లో ఉన్న 25 అంతస్తుల ‘కుక్రేజా ప్యాలెస్’ బిల్డింగ్ భవనంలో అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీపావళి పండుగ ముందర స్థానికులు కాల్చిన ఒక బాణసంచా రాకెట్ నేరుగా బిల్డింగ్‌లోని 23వ అంతస్తులోకి దూసుకెళ్లింది. దీంతో క్షణాల్లోనే మంటలు చెలరేగి, అంతస్తు మొత్తానికి వ్యాపించింది.

ఈ ఘటన సమయంలో అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ముంబై అగ్ని మాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ల్యాడర్లు, ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>