దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి యువతిపై అత్యాచారం

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ శివారు ప్రాంతమైన దుండిగల్‌ (Dundigal) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ కామాందుడు యువతిపై అత్యాచారం చేశాడు. యువతిని గదిలోకి బలవంతంగా లాకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు యువతి ప్రతిఘటించగా.. పగిలిన బాటిల్‌తో చంపేస్తానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న యువతి మేనత్త కేకలు వేయడంతో నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు.బాధితులకు స్థానికులు సైతం తోడై నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>