కలం, వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లాలో ఏపీ ఏసీబీ (AP ACB) అధికారులు ఓ ప్రభుత్వ అధికారిని లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నవాబుపేటకు చెందిన బాబీ గిడ్డంగి ఏర్పాటుకు ఎన్వోసీ కోసం కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాన్ని సంప్రదించారు. ఇందుకు సంబంధిత అధికారి ముందు రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ.30 వేలకు ఒప్పందం కుదిరింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల ప్లాన్ ప్రకారం బాబీ నుంచి రూ.30 వేలు తీసుకుంటున్న సమయంలో సదరు అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

