కలం, వెబ్ డెస్క్: ధన త్రయోదశి పండుగ రోజున బంగారం, వెండి ధరలు పుత్తడి ప్రియులకు భారీ ఊరట కల్గించాయి. ఈ మేరకు నవంబర్ 6న గోల్డ్ రేట్స్ (Gold – Silver Prices) భారీగా తగ్గాయి. ఈ పండుగ రోజున బంగారం, వెండి కొనడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపుతుండటంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. అటు ధరలు తగ్గడంతో బంగారం కొనుగోలు దుకాణాల్లో జోష్ కనిపిస్తోంది. ధనత్రయోదశి రోజున సాధ్యమైనంతవరకు ఏ కొద్ది పాటి బంగారమైన కొనాలన్న నమ్మకం ఉండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.
ఇక బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.2,560 తగ్గి రూ.1,43,460గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,350 తగ్గి రూ.1,31,500గా కొనసాగుతోంది. అటు వెండి ధరల్లోనూ భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఏకంగా కిలో వెండి ధర రూ.5000 తగ్గి రూ.2,05,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలైన హైదరాబద్, వరంగల్, విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి పట్టణాలో దాదాపు ఇవే ధరలు అమలులో ఉన్నాయి. ఈ ధరలపై 3 శాతం జీఎస్టీ అదనంగా ఉంటుంది.

