‘2029లో పోటీ చేయకు’.. జగన్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఓపెన్ ఛాలెంజ్!

కలం, వెబ్ డెస్క్ : ఇటీవల ఏపీలో వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఏకగ్రీవాలపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (MLA Adinarayana Reddy)ఖండించారు. జగన్ తన వ్యాఖ్యలను నిరూపించగలరా? అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు దమ్ముంటే ఓట్ల రిగ్గింగ్ జరిగిందని నిరూపించడానికి తగిన ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. చట్టపరమైన ఆధారాలు లేకుండా కేవలం ఓటమి భారాన్ని తట్టుకోలేక జగన్ ఈ విధంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

గతంలో ఏకగ్రీవ ఎన్నికలపై మాట్లాడి, ప్రజాస్వామ్యాన్ని హేళన చేసిన జగన్.. వచ్చే 2029 ఎన్నికల్లో అసలు పోటీ చేయకూడదని ఆదినారాయణరెడ్డి అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజలే ఆయనను రాజకీయాలకు దూరం చేసే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందకు వెళ్తున్న కూటమి ప్రభుత్వంపై అనవసర నిందలు వేయడం మానుకోవాలని, ఇకపై జగన్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటమే మంచిదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>