కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా బాన్సువాడ ( Banswada ) మండలం రాజారాం దుబ్బాలో అక్రమంగా నిల్వ ఉంచిన 75 గ్యాస్ సిలిండర్ లను సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు.. శంకర్ గౌడ్ అనే వ్యక్తి డొమెస్టిక్ సిలిండర్ల నుండి కమర్షియల్ సిలెండర్ లలో నింపి అది కూడా కిలో 2 కిలోలు తక్కువగా నింపి అధిక ధరలకు అమ్ముతున్నారని సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో దాడులు నిర్వహించినట్లు ఎఎస్ఓ రవీందర్ రాథోడ్ తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు కూడా నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డిటిలు అశోక్, బాలయ్య పోలీసులతో కలిసి దాడుల్లో పాల్గొన్నారు..

