ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్‌పై కేబినెట్ కీల‌క నిర్ణ‌యం

క‌లం, వెబ్‌డెస్క్‌: సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పూర్త‌యిన 2.25 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్ధిదారుల‌తో కొత్త ఇంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో దీపావ‌ళి వేడుక‌ల్లో పాల్గొనాల‌ని సీఎం ఆదేశించారు. అలాగే నవంబర్ 19న ఇందిరా గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించాలని కేబినెట్‌ తీర్మానించింది. ఈ పథకం కోసం నవంబర్ 20 నుంచి 30 వరకు గ్రామాల్లో దరఖాస్తులు స్వీక‌రిస్తారు.

వేర్వేరుగా ఎస్టీ,ఎస్సీ క‌మిష‌న్‌

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రద్దు చేసి, వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని కేబినెట్‌ తీర్మానించింది. ప్రతి కమిషన్‌లో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులు ఉండే విధంగా వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తారు. ఎస్సీ, ఎస్టీల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్ స‌వరణకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక శాఖ చేపట్టాల్సిన చర్యలను ఇందులో పొందుపరుస్తారు. తెలంగాణ సర్వే, సరిహద్దుల చట్టంలోని సెక్షన్ 12 (ఏ) సవరణ ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సర్వే, సరిహద్దులకు సంబంధించి జారీ చేసే నోటీసులపై అప్పీల్ చేసుకునే కాలపరిమితిని 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>