యాదాద్రి ఆల‌యం హుండీ లెక్కింపు

కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (Yadadri Temple) హుండీలకు భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. కేవలం 44 రోజుల వ్యవధిలోనే హుండీ ఆదాయం రూ.2,60,59,278కు చేరడం విశేషంగా నిలిచింది. స్వామివారిపై భక్తుల విశ్వాసం మరోసారి హుండీ ఆదాయం రూపంలో స్పష్టమైంది. గురువారం నిర్వహించిన హుండీ లెక్కింపులో ఈ భారీ ఆదాయం వెల్లడైంది. నగదు కానుకలతో పాటు బంగారం, వెండి సమర్పణలు కూడా గణనీయంగా నమోదయ్యాయి. హుండీల ద్వారా 65 గ్రాముల బంగారం, 2 కిలోల 650 గ్రాముల వెండి లభించాయి. నగదుతోపాటు విలువైన లోహాల రూపంలోనూ భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.

భారీగా విదేశీ కరెన్సీ

దేశ విదేశాల నుంచి యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించే భక్తులు స్వామివారికి విదేశీ కరెన్సీని సైతం కానుకగా సమర్పించారు. అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, సింగపూర్, మలేషియా, శ్రీలంక తదితర దేశాల కరెన్సీ నోట్లు హుండీలో లభించాయి. వియత్నాం కరెన్సీ 1,00,000గా నమోదవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యూరో, స్విస్ ఫ్రాంక్స్‌తో పాటు పలు దేశాల కరెన్సీలు కూడా లెక్కింపులో బయటపడ్డాయి. 44 రోజుల్లో రూ.2.60 కోట్లు దాటిన హుండీ ఆదాయం బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కానుకలు.. యాదాద్రి క్షేత్రానికి భక్తుల నుంచి వస్తున్న ఆదరణకు ఈ లెక్కలు అద్దం పడుతున్నాయి. హుండీ లెక్కింపు వివరాలను శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>