కలం, కరీంనగర్: రైతు సంక్షేమం, సాగునీటి రక్షణ గురించి గొప్పలు చెప్పుకుంటున్న పాలకుల పాలనలో క్షేత్రస్థాయి వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై గత బిఆర్ఎస్ ఈప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నాయని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం రోజున వీణవంక మండల అధ్యక్షులు బత్తిని నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి కోర్కల్, లక్ష్మక్క పల్లి చెక్ డాం ప్రాంతాలను గంగాడి కృష్ణారెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వర్షపు నీటిని ఒడిసిపట్టి, భూగర్భ జలాలను పెంపొందించాల్సిన చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని ప్రభుత్వాలు పూర్తిగా గాలికి వదిలేశాయని కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ చెక్ డ్యామ్‌ల పునః నిర్మాణాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ కూడా అదే బాటలో పయనిస్తూ రైతుల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు. వేలాది ఎకరాలకు సాగునీరు అందించి, తాగునీరుకు, పశువులకు నీటి కొరత లేకుండా ప్రజలందరికీ ఎంతో అవసరమైన ఇక్కడి చెక్ డ్యామ్‌ల పునర్నిర్మాణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు.
ఐదేళ్లయిన చెక్ డ్యామ్ ల పునర్ నిర్మాణానికి విముక్తి కలగడం లేదని, గత బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ కు ఈ విషయంలో ఉన్న చిత్తశుద్ధి ఏంటో స్పష్టంగా అర్థమవుతుందని కృష్ణారెడ్డి విమర్శించారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సొంత మండలమైన వీణవంకలోనే చెక్ డ్యామ్‌ల పునః నిర్మాణాల విషయాన్ని గాలికి వదిలేసారని ఆరోపించారు.
ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి గెలిచి మూడేళ్లయిన చెక్ డ్యాముల పునః నిర్మాణంలో విషయంలో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా ఉండి సొంత మండలంలో అవసరమైన ప్రాంతాల్లో చెక్ డ్యామ్‌లు పున నిర్మించాలనే కనీస సోయి, ఆలోచన ఎమ్మెల్యేకు లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎన్నికల హామీలు, రాజకీయ విమర్శలు పక్కనపెట్టి నియోజకవర్గ అభివృద్ధ్దిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
మండలంలోని కోర్కల్, లక్ష్మక్కపల్లి గ్రామాల్లో రైతుల సౌలభ్యం కోసం వెంటనే చెక్ డ్యామ్‌ల పునః నిర్మాణాలు చేపట్టాలని కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు స్పందించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, లేనియెడల రైతులను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్ నరసింహ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కనుమల గణపతి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు జిల్లా కార్యదర్శి, సంపత్ రావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వినోద్ కుమార్, హుజురాబాద్ జమ్మికుంట రూరల్ పట్టణ ఇల్లందకుంట అధ్యక్షులు బైరెడ్డి రమణ రెడ్డి, తోడ్పాటు రాజు, పారిపెల్లి కొండాల్ రెడ్డి, మాజీ మండలం అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి, ముత్యాల రవీందర్, శ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి, పెద్ది మల్లారెడ్డి, ఎంగంటి శ్రీనివాస్, సర్పంచులు దాట్ల వీరస్వామి కొలిపాక రజిత శ్రీనివాస్ తనుకు సంధ్య సందీప్ చొప్పరి సారమ్మ సారయ్య, హరికృష్ణ ఎల్లగౌడ్ కర్రె నాని అప్పని కొమురయ్య, పుప్పాల రోజా రాములు, రమణ రెడ్డి సమ్మయ్య వర్కుల్ రాజు అర్షం శ్రీనివాస్, స్వామి, వెంకటేశ్వర్లు, అశోక్, కోలిపాక వెంకటేష్, లింగారెడ్డి, అనిల్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులుపాల్గొన్నారు.

