కిసాన్ సాగర్ అభివృద్ధిపై రాజకీయ రగడ.. కార్పొరేటర్ సంచలన వ్యాఖ్యలు

కలం, కరీంనగర్ బ్యూరో: పదేళ్ల పాటు అధికారంలో ఉండి కిసాన్ నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయిన నాయకులు, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవాలని చూస్తున్నారని కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్ (Somidi Venu Prasad) ఆరోపించారు. కిసాన్ నగర్ ప్రజలను ఉద్దేశించి ఆయన విడుదల చేసిన విజ్ఞప్తిలో గతంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యే, కిసాన్ నగర్ మాజీ కార్పొరేటర్లు ఇన్నేళ్లుగా ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు.

ప్రస్తుతం ప్రజల కోసం తాను చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయంగా ఎదుర్కోలేక, తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తాను టీఆర్ఎస్ నాయకురాలిని డబ్బులు అడిగానంటూ అసత్య ఆరోపణలు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, కిసాన్ నగర్‌లో అభివృద్ధి ఎవరు చేస్తున్నారో, ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారో ప్రజలే గమనిస్తున్నారని పేర్కొన్నారు. అబద్ధపు ఆరోపణలు, రాజకీయ విమర్శలతో తన ప్రజాసేవను ఆపలేరని స్పష్టం చేశారు. కిసాన్ నగర్ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా అభివృద్ధి కోసం తన పోరాటం కొనసాగిస్తానని కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్ (Somidi Venu Prasad) తెలిపారు.

Also Read : రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>