కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో కలిపి ప్రయాణించేందుకు వీలుగా అందించే కామన్ పాస్ (Metro RTC Common Pass) ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయంటూ ప్రయాణికుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలు, ఫిర్యాదుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా పాస్ ధరలను సవరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సవరణలో భాగంగా ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేలా నెలవారీ కామన్ పాస్ (Metro RTC Common Pass) ధరను రూ.8,500 నుంచి రూ.4,500కు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనితో పాటు రోజువారీ పాస్ ధరను కూడా రూ.400 నుంచి రూ.325కు తగ్గించనున్నారు. ఈ కామన్ పాస్ కలిగిన ప్రయాణికులు TGSRTC సిటీ బస్సులతో పాటు మెట్రో రైళ్లలో అపరిమితంగా ప్రయాణించే సౌకర్యాన్ని పొందవచ్చు. నగరంలో ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ తగ్గింపు నిర్ణయానికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేయనుంది.
Also Read : నల్లగొండ కార్పొరేషన్లో ‘ఇంటి దొంగలు’!
Follow Us On: X(Twitter)

