డంపింగ్ యార్డులో బయో మైనింగ్ వేగవంతం చేయాలి: ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో: ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) సూచించారు. నిజామాబాద్ నాగారం శివారులోని డంపింగ్ యార్డు(Dumping Yard)ను కలెక్టర్ బుధవారం సందర్శించారు. నగర పాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిలువ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

చెత్తను ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ, ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను ఆరా తీశారు. ప్రతి రోజు సగటున 600 మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ జరుపుతుండగా, దానిని వెయ్యి మెట్రిక్ టన్నులకు పెంచాలని కలెక్టర్ సూచించారు.

డంపింగ్ యార్డు ప్రాంతంలో ఖాళీ స్థలాలను గుర్తించి విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పచ్చదనం పెంపొందించాలని అన్నారు. డంపింగ్ యార్డు ప్రాంతం అంతా కవర్ అయ్యేలా సోలార్ ప్యానెల్స్ తో పని చేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వ్యర్థాల శుద్ధి ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. డంపింగ్ యార్డు ప్రదేశంలోని రోడ్డుకు ఆనుకుని ఇరువైపులా వ్యర్థాలను పోగు చేయకుండా దూరంగా తరలించాలని అన్నారు.

రోడ్లపై పశువులను వదిలితే కేసులు నమోదు చేయండి

రోడ్లపై ఎక్కడబడితే అక్కడ పశువులు సంచరించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశించారు. డంపింగ్ యార్డు ప్రాంతంతో పాటు నగరంలోని ప్రధాన రహదారులపై ఆవులు, ఇతర పశువులు ఎక్కడబడితే అక్కడ సంచరిస్తుండడం గమనించిన కలెక్టర్ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై పశువుల సంచారం వల్ల వాహన చోదకులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పశువులు రోడ్లపై సంచరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్లపై పశువులను వదిలితే కేసులు నమోదు చేయాలని, జరిమానాలు విధించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.

Also Read : అమెరికా ఎన్నికల్లో ఓటమి.. ట్రంప్​ కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>