అమెరికా ఎన్నికల్లో ఓటమి.. ట్రంప్​ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రెసిడెంట్ డొనాల్డ్​​ ట్రంప్​ (Donald Trump) నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్​ పార్టీపై డెమోక్రటిక్ పార్టీ పై చేయి సాధించింది. ఈ క్రమంలో న్యూయార్క్ టైమ్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ​ఎన్నికల ఫలితాల (America Election Results) ను అంగీకరిస్తానని, డెమోక్రాట్ల​తో కలిసి పనిచేస్తానని చెప్పారు.

అంతకుముందు, ఎన్నికల ఫలితాలపై ట్రంప్​ తనదైన శైలిలో స్పందించారు. తాను ఎన్నికల బరిలో లేకపోవడం వల్లే రిపబ్లికన్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదని ట్విస్ట్​ ఇచ్చారు. ఒకవేళ తాను కూడా పోటీలో ఉండి ఉంటే రిపబ్లికన్లు భారీ మెజారిటీతో విజయం సాధించేవారని ట్రూత్ (Truth) వేదికగా ఆయన ఇంట్రెస్టింగ్​ పోస్ట్​ పెట్టారు.

మరోవైపు, మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్​ పార్టీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలు ఉండగా, ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో​ లో డెమోక్రాట్లు 158కి పైగా సీట్లు సాధించి ముందంజలో ఉండగా రిపబ్లికన్లు 99 స్థానాలతో వెనకబడ్డారు. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం డెమోక్రాట్​ పార్టీ లీడ్​ లో కొనసాగుతుండడంతో అమెరికా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అలాగే, ట్రంప్​ రాజకీయ భవిష్యత్తుపై ఈ ఎన్నికల ఫలితాలు (America Election Results) ఎలాంటి ప్రభావం చూపే అవకాశంపై ఆసక్తి నెలకొంది.

Also Read : “యుద్ధానికి అమెరికన్లు నో”.. యూఎస్​ ఎన్నికల ఫలితాలపై ఇరాన్​ స్పీకర్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>