అక్రమ ఆస్తుల వేట: ఏపీ గ్రూప్-1 స్కాంలో ఈడీ దూకుడు!

కలం, వెబ్ డెస్క్ : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల అక్రమాల (APPSC Group 1 Scam) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, విజయవాడల్లోని ఏడు కీలక ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మూల్యాంకన వ్యవహారంలో ప్రధాన నిందితులుగా ఉన్న విశ్రాంత ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు మధుసూదన్ రావు నివాసాలతో పాటు పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.

గుంటూరు సమీపంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలు దిద్దించి, కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సిట్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఆర్థిక మూలాలపై ఆరా తీస్తున్నారు. ఈ సోదాల్లో పలు కీలక డిజిటల్ పరికరాలు, హార్డ్‌ డిస్క్‌లు, విదేశీ ఆర్థిక లావాదేవీల రికార్డులతో పాటు రీ-వాల్యుయేషన్ పేరుతో సృష్టించిన అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Also Read : సీఎం చంద్రబాబుకు మోదీ ఫోన్​.. తుఫాన్​ ప్రభావంపై ఆరా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>