వనపర్తిలో మెడికల్ షాపులపై అధికారుల కొరడా.. షోకాజ్ నోటీసులు జారీ!

కలం, వనపర్తి: వనపర్తి పట్టణంలోని వివిధ ఆసుపత్రులకు అనుబంధంగా నిర్వహిస్తున్న మెడికల్‌ షాపులపై TG SAFE–డ్రగ్స్‌ వింగ్‌ (TG SAFE Drugs Wing) అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన డిప్యూటీ డైరెక్టర్‌ అంజుమ్‌ అబిద ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో ఔషధాల విక్రయ నిబంధనల అమలును పరిశీలించారు.

మెడికల్‌ షాపుల్లో రిజిస్టర్డ్‌ ఫార్మసిస్టులు అందుబాటులో ఉన్నారా, ఔషధాల కొనుగోలు, విక్రయ రికార్డులు సక్రమంగా నిర్వహిస్తున్నారా, షెడ్యూల్‌ H1 మందుల విక్రయ వివరాలు నమోదు చేస్తున్నారా, గడువు ముగిసిన మందులను విక్రయానికి ఉంచుతున్నారా అనే అంశాలను తనిఖీ చేశారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ ప్రకారం మందులు విక్రయిస్తున్నారా, అవసరమైన అనుమతులు, రిజిస్టర్లు ఉన్నాయా అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు

నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన మెడికల్‌ షాపుల యాజమాన్యాలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి, వివరణల అనంతరం చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఔషధాలు అందించడమే లక్ష్యమని, మెడికల్‌ షాపుల నిర్వాహకులు డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఈ తనిఖీల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్లు డి. సరిత (మహబూబ్‌నగర్‌), జి. ప్రసాద్‌ (రంగారెడ్డి), వనపర్తి జిల్లా డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రష్మితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Also Read : రోజుల తరబడి ఆందోళన చేస్తారా?: సుప్రీం కోర్టు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>