కలం, కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి (Karepalli) పట్టణంలోని పలు ప్రాంతాల్లో గత వారం రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో రహదారులన్నీ చీకటిమయంగా మారడంతో వాహనదారులు, పాదచారులు భయాందోళనల మధ్య ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. చీకటి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీధి దీపాలు పనిచేయడం లేదని సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కనీస అవసరమైన వీధి దీపాలను కూడా సక్రమంగా నిర్వహించలేరా? వారం రోజులుగా సమస్య కొనసాగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పనిచేయని వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టి కారేపల్లి (Karepalli) పట్టణంలో రాత్రివేళ వెలుగులు నింపాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేస్తున్నారు.
Also Read : రోజుల తరబడి ఆందోళన చేస్తారా?: సుప్రీం కోర్టు
Follow Us On : WhatsApp

