అమిత్ షాకు ఎంపీ చామల కౌంటర్

కలం, వెబ్ డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) కౌంటర్ ఇచ్చారు. 3 కోట్ల మంది ఇల్లీగల్ గా దేశంలోకి వస్తే హోం మంత్రిగా ఏం చేశారని ప్రశ్నించారు. దేశంలోకి ఎంతమంది విద్రోహ శక్తులు వచ్చాయి? దేశంలో ఇంటర్నల్ సెక్యూరీటి పరిస్థితి ఏంటి? అని నిలదీశారు. సర్ ప్రక్రియను అడ్డం పెట్టుకొని పర్మినెంట్ గా అధికారంలో ఉండాలని బీజేపీ చూస్తోందని దుయ్యబట్టారు.

ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఓట్ల దానంతో తెలంగాణలో 8మంది ఎంపీలు గెలిచారని చామల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు అంటూ విమర్శించారు. ఇక అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై మాట్లాడుతూ.. అమిత్ షా హైదరాబాద్ కంటే మణిపూర్ పోయి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. మణిపూర్ అల్లర్లతో బగ్గుమంటుందని చెప్పుకొచ్చారు.

కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 ఏళ్ళ నుండి బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుండి ఎంత మంది దేశంలోకి వచ్చారు? అని ఎంపీ చామాల (Chamala Kiran Kumar Reddy) నిలదీశారు. దేశంలో మోదీ, అమిత్ షాల వలన 2014 నుండి దేశానికి దరిద్రం పట్టిందని దుయ్యబట్టారు. కేరళ, తమిళనాడు, హర్యానాలో ఒక్క ఓటు కూడా బీజేపీకి పడదని హెచ్చరించారు.  డబుల్ సర్కార్ అంటే గంగా, యమునా, సబర్మతినే అభివృద్ధి చేస్తారా? మిగతా రాష్ట్రాల్లో అభివృద్ధి చేయరా? అని ప్రశ్నించారు. ఓట్ చోరీపై తమ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అడిగిన డిమాండ్లను బీజేపీ నెరవేర్చాలన్నారు.

Also Read : “మరో స్కామ్ కు కుట్ర”.. కాంగ్రెస్​ పై జగదీష్ రెడ్డి ఆరోపణలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>