ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు దరఖాస్తు గడువు పెంపు

కలం, వెబ్ డెస్క్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) భాగంగా ఓటు దరఖాస్తు గడువును పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. నామినేషన్ల చివరి రోజు వరకు కూడా అప్లై చేసుకోవచ్చని పట్టభద్రులకు సూచించింది. ఈ నెల 25 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయబోతున్నట్లు ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంకా తేదీలను ప్రకటించలేదు. 2027 మార్చి నెలలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ముగిశాకే తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది.

రెండు కీలక స్థానాల్లో..

వరంగల్-ఖమ్మం-నల్లగొండ, హైదరాబాద్-మహబూబాబ్ నగర్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు స్థానాలను చేజిక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సామ రామ్మోహన్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డిని ప్రకటించింది. మరోవైపు బీఆర్ఎస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోయినా ఏనుగుల రాకేశ్ రెడ్డి, కాసాని వీరేశ్ పేర్లను దాదాపుగా నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. బీజేపీ నుంచి హైదరాబాద్ పట్టభద్రుల స్థానంలో పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>