ఐపీఎల్ ఎంట్రీపై మాజీ పాకిస్తాన్ పేసర్ క్లారిటీ..!

కలం, స్పోర్ట్స్ : తాను ఐపీఎల్ ఆడడం లేదని మాజీ పాకిస్తాన్ పేసర్ మహమ్మద్ ఆమిర్ (Mohammad Amir) స్పష్టం చేశారు. ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్నట్లు వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ ప్రచారానికి ముగింపు పలికారు. ఇటీవలే ఆమిర్ అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ కోసం బ్రిటీష్ పౌరుడిగా పేరు నమోదు చేసుకున్నారు. భార్య నర్జిస్ ఖాన్ ద్వారా ఆయనకు బ్రిటీష్ పౌరసత్వం లభించింది. దీంతో ఆయన స్థానిక ప్లేయర్‌గా ‘ది హండ్రెడ్’ లీగ్‌లో కూడా పాల్గొన్నారు. ఈ మార్పుల వల్లే ఆయన ఐపీఎల్‌లోకి వస్తారనే పుకార్లు వ్యాపించాయి.

గతంలో అజర్ మహమూద్ కూడా బ్రిటీష్ పాస్‌పోర్టుతో ఐపీఎల్‌లో పంజాబ్, కోల్‌కతా జట్లకు ఆడారు. దీంతో ఆమిర్ (Mohammad Amir) కూడా అదే దారిలో వెళ్తారని ప్రచారం సాగింది. అయితే తన పాత పాకిస్తాన్ క్రికెట్ అధ్యాయం ముగిసిందని, ఈ ప్రచారాలన్నీ అబద్ధమని ఆమిర్ పేర్కొన్నారు. మహమ్మద్ ఆమిర్ 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. తన కెరీర్‌లో 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20లు ఆడారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫ్రాంచైజ్ లీగ్‌లలో కొనసాగుతున్నారు.

Also Read : భువీకి ఇక కష్టమేనా.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>