కలం, వెబ్ డెస్క్: ఏపీలో మున్సిపాలిటీ ఎన్నికల్లో (AP Municipal Elections) టీడీపీ హవా కొనసాగుతోంది. తాజాగా మచిలీపట్నం కార్పొరేషన్ కైవసం చేసుకుంది. ఉయ్యూరు మున్సిపాలిటీలో కూడా ఘన విజయం సాధించింది. ఇక్కడ 32 వార్డులకు గాను టీడీపీ 21, జనసేన 7, వైసీపీ రెండు, ఇతరులు రెండు వార్డుల్లో గెలుపొందారు. కొవ్వూరు, నిడదవోలు, నగరి, రాయదుర్గం, కమలాపురం, మైదుకూరు, బద్వేలు, మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది. ఎమ్మిగనూరులోని 44 వార్డులకు గాను 34 వార్డుల్లో టీడీపీనే గెలిచి మున్సిపాలిటీపై పసుపు జెండా ఎగరేసింది.
జంగారెడ్డిగూడెంలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఛైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి రొంగల అనూష 7,503 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వెంకటగిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి దొంతు శారద, ఆత్మకూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా గెలుపొందారు. పెడన మున్సిపాలిటీలో జనసేన ఘన విజయం సాధించగా.. తిరువూరులో లీడ్ లో ఉంది. అనేక చోట్ల తెలుగుదేశం పార్టీనే వైసీపీ కంటే ముందంజలో ఉంది.

