కలం, సోన్: నిర్మల్ (Nirmal) పట్టణంలో బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహిస్తున్న బీజేపీ మహా పాదయాత్రలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Minister Bandi Sanjay Kumar) నిర్మల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టే లక్ష్యంతో బీజేపీ ఈ మహా పాదయాత్ర చేపట్టింది. గంజాల్ టోల్ ప్లాజా వద్ద స్వాగతం అనంతరం బండి సంజయ్‌తో కలిసి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రకు బయలుదేరి వెళ్లారు.

