రాజులతాండలో రూ.28 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

కలం, నేరడిగొండ: నేరడిగొండ మండలంలోని బుద్దికొండ గ్రామ పంచాయతీ పరిధిలో గల రాజులతాండ (Rajulathanda) గ్రామంలో అభివృద్ధి పనులకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) శ్రీకారం చుట్టారు. మంగళవారం గ్రామంలో రూ.28 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజులతాండ చిన్న గ్రామమైనప్పటికీ అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

గ్రామస్తుల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు రాజులతాండ నుంచి పొచ్చర వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ సహకరిస్తూ ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>