కలం, వెబ్ డెస్క్ : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan)పై పోలీసు కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున పులివెందులలోని ఆర్వో కార్యాలయం ఎదుట జగన్ ఆందోళన చేశారు. తమ ఏజెంట్లను బూత్ ల్లోకి రానివ్వడం లేదని దాదాపు 70 మంది బూత్ ఏజెంట్లతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పోలీసులు చర్యలు తీసుకున్నారు. జగన్‌తో పాటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పోలింగ్ కౌంటింగ్ రోజే ఇద్దరు వైసీపీ నేతలపై కేసులు నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

