కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించనున్న బీజేపీ ర్యాలీ నేపథ్యంలో ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు (Traffic Diversions) చేపట్టినట్టు డీఎస్పీ శ్రీనివాస్ (DSP Srinivas) సోమవారం తెలిపారు. ర్యాలీ సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
భైంసా వైపు నుంచి నిర్మల్‌కు వచ్చే వాహనాలు తల్వేద మీదుగా గాజులపేట్ చేరుకుని అక్కడి నుంచి పట్టణంలోకి రావాలన్నారు. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు కడ్తాల్, కొండాపూర్, ఎల్లపెల్లి మీదుగా బంగల్పేట్, ఖానాపూర్ వైపు నుంచి వచ్చే వాహనాలు కొండాపూర్, ఎల్లపెల్లి, బంగల్పేట్ మీదుగా పట్టణంలోకి చేరుకుని చేరుకోవాలన్నారు. వాహనదారులు ఈ మార్గమళ్లింపులను ముందుగానే గమనించి, సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని డీఎస్పీ శ్రీనివాస్ కోరారు.

