మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: సీఐ భాస్కర్

కలం, యాదగిరిగుట్ట : యువతను నిర్వీర్యం చేస్తూ, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిపై యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయిపల్లిలో అవగాహన కార్యక్రమం (Drug Awareness Programme) నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండటమే కాకుండా, వాటి బారిన పడకుండా సమాజం అప్రమత్తంగా ఉండాలనే సందేశాన్ని యాదగిరిగుట్ట టౌన్ సీఐ భాస్కర్ (CI Bhaskar) , గ్రామస్థులకు అందించారు.

క్షణిక ఆనందం కోసం మొదలయ్యే మత్తు పదార్థాల అలవాటు చివరకు జీవితాన్నే ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి తీసుకొస్తుందని ఈ సందర్భంగా వివరించారు. స్నేహితుల ఒత్తిడి, సరదా ప్రయత్నాలు, ఆసక్తి పేరుతో మాదకద్రవ్యాలకు అలవాటు పడితే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత దెబ్బతింటుందని హెచ్చరించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత తమ లక్ష్యాలను గుర్తుంచుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

మాదకద్రవ్యాల ప్రభావం ఒక్క వ్యక్తికే పరిమితం కాదని, దాని ప్రభావం కుటుంబ ఆర్థిక పరిస్థితులు, సామాజిక గౌరవం, పిల్లల భవిష్యత్తుపై కూడా పడుతుందని వివరించారు. వ్యసనాల కారణంగా చదువులో వెనుకబడటం, కుటుంబాల్లో కలహాలు, నేరప్రవృత్తి పెరిగే ప్రమాదం ఉందని అవగాహన కల్పించారు. మత్తుకు బానిసలు కావద్దు.. జీవితానికి బాటలు వేసుకోండి! అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>