పత్తిసాగులో అధిక దిగుబడే లక్ష్యం.. రైతులకు నిర్మల్ సీడ్స్ సూచనలు

కలం, ​వేములవాడ: “రైతుల అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం” అనే ధ్యేయంతో పనిచేస్తున్న ప్రముఖ విత్తన సంస్థ నిర్మల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Nirmal Seeds Pvt Ltd) ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) మండల కేంద్రంలో పత్తి పంట క్షేత్ర ప్రదర్శన, రైతు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ​స్థానిక రైతు నీలం శంకరయ్య తన పొలంలో సాగు చేసిన NCH-4341 రకం పత్తి పంటను క్షేత్ర ప్రదర్శన కోసం ఎంచుకున్నారు.

ఈ ప్రదర్శనలో పంట దిగుబడి, కాయల పరిమాణం, తెగుళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఇతర రైతులు ఎంతో ఆసక్తి కనబరిచారు. ఈ కార్యక్రమానికి వేములవాడ పరిసర ప్రాంతాలలోని 8 గ్రామాల నుండి సుమారు 160 మంది రైతులు, 15 మంది ఆదర్శ రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిర్మల్ సీడ్స్ సంస్థ ప్రతినిధులు పత్తి సాగులో పాటించాల్సిన యజమాన్య పద్ధతులు, సరియైన ఎరువుల వినియోగం, దిగుబడి పెంపొందించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు విలువైన సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ సీడ్స్ ఆర్.ఎం.సందీప్, డి.ఆర్.ఎం. లక్ష్మణ్, టెరిటోరియల్ ఆఫీస్ ప్రతినిధి మాధవరావు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ​ఈ సందర్భంగా నిర్మల్ సీడ్స్ ప్రతినిధులు మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనాలను అందించడం ద్వారా రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని అందించడమే తమ సంస్థ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు NCH-4341 పత్తి రకం పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు.

​

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>