చార్మినార్​ భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్​ షా పూజలు

కలం, వెబ్​ డెస్క్​: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా (Amit Shah) హైదరాబాద్​ లో పర్యటిస్తున్నారు. నగరానికి చేరుకున్న ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. పార్టీ నిర్వహిస్తున్న మహాయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ముందుగా ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఐటీసీ కాకతీయ హోటల్​ లో లంచ్​ చేసి నేతలతో సమావేశం కానున్నారు. 2 గంటల నుండి 4 గంటల వరకు అమిత్​ షాను సినీ, ఇతర ప్రముఖులు కలవనున్నారు. అనంతరం 4 గంటలకు అమిత్​ షా మహాపాదయత్రలో పాల్గొంటారు. జగ్జీవన్​ రామ్​ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్​ వరకు ‘లోక్​ తంత్ర బచావో–అరాచకత హటావో’ పెరుతో పాదయాత్ర కొనసాగనుంది.

Also Read : అమెరికాపై కుట్ర.. సైనికుల ఫ్రీజర్లపై సైబర్​ ఎటాక్​!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>