గో సంరక్షణకు ఎమ్మెల్యే భారీ విరాళం.. సొంత నిధులతో గోశాల నిర్మాణం!

కలం, నిర్మల్: గో సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, గోవులను పెంచుతూ వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకా మద్నాపూర్ గ్రామంలోని గంగేశ్వర్ మహారాజ్ ఆశ్రమంలో ఆయన తన సొంత నిధులు రూ. 35 లక్షలు వెచ్చించి గోశాలను నిర్మించారు. సోమవారం గంగేశ్వర్ మహారాజ్ సమక్షంలో గోశాలను ప్రారంభించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ గోశాల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గోవుల సంరక్షణ, పోషణకు గోశాలలు ఎంతో అవసరమని, గో సంపదను కాపాడుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వీలైనంతగా గోవులను పెంచి వాటి పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మహారాజ్‌లు, మున్సిపల్ చైర్మన్ తుమ్మోల్ల దత్తాత్రి, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>