ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపోల్స్​

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ (AP Municipal Polling) ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మున్సిపాలిటీల వారీగా చూస్తే మార్కాపురం జిల్లా కనిగిరిలో అత్యధికంగా 61.86 శాతం పోలింగ్ నమోదైంది. జమ్మలమడుగులో కూడా 61.86 శాతం ఓటింగ్ నమోదై రెండో స్థానంలో నిలిచింది. నగరిలో 60.81 శాతం పోలింగ్ నమోదైంది.

ఇక నగరపాలక సంస్థల విషయానికి వస్తే విజయవాడలో 36.40 శాతం, అనంతపురంలో 32.60 శాతం, తిరుపతిలో 32.57 శాతం, కడపలో 30.75 శాతం పోలింగ్ నమోదైంది. విశాఖపట్నంలో అత్యల్పంగా 27.55 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. ఎన్నికల అధికారులు పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మంగళవారం నాడు చేపట్టనున్నామని అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>