కలం, మునుగోడు: మర్రిగూడ (Marriguda) మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తానేదారిపల్లి కాలనీకి చెందిన మృతుడి వాటికోటి కొండయ్య కుటుంబానికి సర్పంచ్ నర్సింహా చేయూతగా నిలిచారు. కొండయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఆయన అంత్యక్రియల కోసం కూ.5000 ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి విషాదంలో ఉన్న బాధిత కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములై, ఆపద సమయంలో ఆదుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పొగాకు సైదులు, వార్డు సభ్యులు పగిల్లా శంకర్, పగిల్లా వంశీ, భీమనగోని యాదయ్య, లపంగి మహేందర్, పగిల్లా రమేష్, వాటికోటి జగన్, వాటికోటి ఆదిమయ్య తదితరులు పాల్గొన్నారు.

